దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు తెలుగు సినిమాని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లినా వారిలో ఒకరు. ఈయన ఓ లెంజడరీ డైరెక్టర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏ దర్శకుడు క్రియేట్ చేయని రికార్డులు.. ఆ రోజుల్లోనే దాసరి క్రియేట్ చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పని చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు ఆయన. ఈయన కెరీర్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు, 53 సినిమాలను నిర్మించారు, 250 పైగా సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేశారు! ఈయన తెరకెక్కించిన మొదటి 15 చిత్రాలు హిట్లేనట.
ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్ చేయలేదు. ఓ దశలో రాఘవేంద్ర రావు గారు ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తారు అనుకున్నారంతా. కానీ ఆయన కూడా 9 దగ్గర అవుట్ అయ్యారు.అంతటి గొప్ప చరిత్ర ఉన్న దాసరి నారాయణ రావు గారు 1992లో ‘సూరిగాడు’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అటు తర్వాత ఆ చిత్ర నిర్మాత రామానాయుడు గారితో కలిసి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అందులో అప్పటి టాప్ హీరోల గురించి దాసరి చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. ఆ ట్యాగ్ లు ఏంటో ఆ స్టార్ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) నందమూరి బాలకృష్ణ : బాలయ్య ఓ అందమైన నటుడు అంటూ దాసరి గారు చెప్పుకొచ్చారు.
2) రాజశేఖర్ : కొన్ని పాత్రలు రాజశేఖర్ గారు చేస్తేనే బాగుంటుంది. అతనికే సాధ్యం కూడా అంటూ దాసరి గారు చెప్పుకొచ్చారు.
3) చిరంజీవి :ఈయన ఓ స్టార్ హీరో అంటూ దాసరి చెప్పుకొచ్చారు.
4) నాగార్జున : ఈయన ఓ తెలివైన నటుడు అంటూ చెప్పుకొచ్చారు.
5) మోహన్ బాబు : గ్రేట్ ఆర్టిస్ట్… హీరో కంటే కూడా గొప్ప అంటూ దాసరి నారాయణ రావు గారు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?