OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమా గురించి అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేమికులు, సినీ విశ్లేషకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘ఓజి’ గ్లింప్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. 2 ఏళ్లుగా చాలా మంది ‘ఓజి’ గ్లింప్స్ ను రిపీటెడ్ గా చూస్తూ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఇక ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ కూడా అదే రేంజ్లో హై ఇచ్చింది.

OG Trailer

కానీ ‘సువ్వి సువ్వి సాంగ్’ కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ లో టెన్షన్ మొదలైంది. ‘ఓజి’ గ్లింప్స్ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా సినిమాపై అదే హైప్ ఉండేదేమో. కానీ ‘సువ్వి సువ్వి’ సాంగ్ వల్ల కొంచెం సైలెన్స్ అయ్యారు ఫ్యాన్స్. వాళ్లకి జోష్ నింపాలనే ఉద్దేశంతో దర్శకుడు సుజిత్ ట్రైలర్ కట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడట.


అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 18న లేదా 20న ‘ఓజి’ ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. సినిమాకి కనీసం వారం రోజులు లేదా 5 రోజుల ముందు ట్రైలర్ వదిలితే అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి మైలేజ్ వస్తుంది అని అంతా భావిస్తున్నారు. పెద్ద సినిమాలకు కచ్చితంగా మొదటి వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ మొత్తం వచ్చేస్తుంది. కానీ వీక్ డేస్ మొదలైనప్పుడు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగాలంటే కచ్చితంగా ట్రైలర్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండాలి.

ఇక ‘ఓజి’ ట్రైలర్ నిడివి దాదాపు 2 నిమిషాలు ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే 4 వెర్షన్లు కట్ చేశారట. అన్నిటికీ ఒక్కడే నిడివి ఉంటుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ శ్వాగ్, పంచ్ డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ట్రైలర్ కి హైలెట్ గా నిలుస్తాయట.

‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus