Tollywood: టాలీవుడ్ కు సెంటిమెంట్ గా ఉన్న తేదీ ఏంటో తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని తేదీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది..అలాగే మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక తేదీ ప్రత్యేకంగా ఉంది. ఆ తేదీ ఏంటి..? ఆ తేదీకి ఇండస్ట్రీకి ఉన్న సంబంధం ఏంటి..? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ కు ఏప్రిల్ 28″ ఈ డేట్ చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అదేంటో ఏప్రిల్ 28 న సినిమా రిలీజ్ చేస్తే చాలు ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. వీటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్లుగా ఉండడం విశేషం. ఆ సినిమాలను ఒకసారి గమనిస్తే…

(Tollywood) టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడికైనా, ఎంత టాప్ హీరోకైనా కొన్ని సెంటిమెంట్స్ కామన్. దర్శక ధీరుడు రాజమోళి దగ్గర నుంచి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ వరకు..సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు ఏదో ఒక సెంటిమెంట్ కి తలవంచక తప్పదు. అయితే అలాంటి సెంటిమెంట్ ఒకటి ఈ రోజు చోటు చేసుకుంది. అయితే ఈ సెంటిమెంట్ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ సెంటిమెంట్ కావడం గమనార్హం.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ రోజు సినిమా రిలీజ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. తెలుగులో మొదటి సారి ఏప్రిల్ 28 న అనార్కలి అనే సినిమా రిలీజయింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ ప్రేమ కథా చిత్రం అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత 1977 లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. జయప్రద హీరోగా నటించిన ఏ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

ఇక ఈ సినిమా అప్పట్లోనే 3కోట్ల గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. 1994 ఏప్రిల్ 28 న రిలీజైన యమలీల ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ విజయాన్ని అందుకుంది. అలీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వసూళ్ల పరంగా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఒక కామెడీ హీరోకి ఇలాంటి కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక 2005 లో ఇదే తారీఖున విడుదలైన చిన్న సినిమాలు కూడా హిట్ లిస్టులో చేరిపోయాయి. వేణు మాధవ్ నటించిన హంగామా, అదే విధంగా శివాజీ నటించిన మిస్టర్ ఎర్రబాబు సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి 2006 లో సూపర్ స్టార్ మహేష్ నటించిన పోకిరి సినిమా అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి మహేష్ స్టార్ డమ్ అమాంతం పెంచేసింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఏప్రిల్ 28 న ఎలాంటి సినిమాలు రిలీజ్ కాలేదు. 2017 లో బాహుబాలి 2 సినిమా రిలీజై తెలుగు సినిమా స్టామినాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా ఏప్రిల్ 28 న రిలీజ్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 6 ఏళ్ళ క్రితం వచ్చిన బాహుబలి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు చాలా రివార్డులు కూడా వచ్చాయి.

ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోతున్నారు. ఇక తాజాగా ఈ రోజు (ఏప్రిల్ 28) అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం థియేటర్లలో సందడి చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత అఖిల్ నుంచి ఈ సినిమా రావడం, పైగా సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో అభిమానుల్లో అంచనాలను పెంచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ అఖిల్ కెరియర్ లోనే ఈ సినిమా బీగెస్ట్ సినిమాగా నిలిచింది. మరి ఇన్ని సినిమాలు ఇదే రోజు విడుదలై పెద్ద హిట్లుగా నిలవడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus