Vijay, Trisha: ఆ కామెంట్లపై విజయ్ త్రిష స్పందించకపోతే మాత్రం ఇబ్బందేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ త్రిష జోడీకి మంచి గుర్తింపు ఉంది. విజయ్ (Vijay) త్రిష (Trisha) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. లియో (Leo) సినిమాతో ఈ జోడీ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. మరోవైపు విజయ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోనని పాలిటిక్స్ తో తాను భవిష్యత్తులో బిజీ కానున్నానని పలు సందర్భాల్లో వెల్లడించడం గమనార్హం. విజయ్ చివరి సినిమాలో సైతం త్రిష హీరోయిన్ గా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే త్రిష తాజాగా విజయ్ తో లిఫ్ట్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఒక ఇంగ్లీష్ సాంగ్ ను సైతం పోస్ట్ చేశారు. అయితే విజయ్, త్రిష కలిసి కనిపించడం ఇదే తొలిసారి కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా వీళ్లిద్దరూ కలిసి కనిపించారని తెలుస్తోంది. కొంతమంది నెటిజన్లు అందుకు సాక్ష్యంగా పాత ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తుండగా ఆ ఫోటోలు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

విజయ్, త్రిష వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ పై విజయ్, త్రిష స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. త్రిష పెళ్లికి దూరంగా ఉండటం కూడా వైరల్ అవుతున్న వార్తలకు కారణమని చెప్పవచ్చు. త్రిష ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత విశ్వంభర (Vishwambhara) సినిమాతో త్రిష తెలుగులో తన లక్ పరీక్షించుకుంటున్నారు.

సౌత్ ఇండియాలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు కాగా భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే త్రిష రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వివాదాస్పద విషయాలకు త్రిష దూరంగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్, త్రిషలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus