సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఫైనల్ కలెక్షన్లు బయటకి వచ్చాయి. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘బిగ్ బెన్ సినిమాస్’ బ్యానర్లు కలిసి నిర్మించాయి. జూలై 26 న తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలయిన ఈ చిత్రం… వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్నప్పటికీ … వీక్ డేస్ లో మాత్రం ఘోరంగా పడిపోయింది. 15 నిముషాలు ట్రిమ్ చేసినా, సక్సెస్ టూర్లు అనౌన్సు చేసినా.. కనీసం కలెక్షన్లు రాకపోవడం గమనార్హం.
ఇక ‘డియర్ కామ్రేడ్’ క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 6.80 కోట్లు
సీడెడ్ – 1.22 కోట్లు
వైజాగ్ – 1.70 కోట్లు
ఈస్ట్ – 1.25 కోట్లు
కృష్ణా – 0.80 కోట్లు
గుంటూరు – 1.05 కోట్లు
వెస్ట్ – 0.92 కోట్లు
నెల్లూరు – 0.53 కోట్లు
———————————————————–
ఏపీ+నైజాం టోటల్ – 14.27 కోట్లు (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.70 కోట్లు
ఓవర్సీస్ – 3.50 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 21.47 కోట్లు (షేర్)
————————————————————–
ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదనిపించుకున్న ‘డియర్ కామ్రేడ్’…. ఆ తరువాత ఘోరంగా పడిపోయింది. ఒక్క నైజాం, ఓవర్సీస్ లో మాత్రమే 70 శాతం రికవరీ అయ్యాయి. ఇక మిగిలిన ఏ ఏరియాల్లోనూ కనీసం వసూళ్ళను రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 21.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో సినిమాని డిజాస్టర్ లిస్ట్ లో చేర్చారు ట్రేడ్ పండితులు.