Vishal, Karthi: స్టార్ హీరోలకు హత్యా బెదిరింపులు!

కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట ఆర్టిస్ట్ రాజా దురై. దీంతో నడిగ‌ర్ సంఘానికి చెందిన అధికారి ధ‌ర్మ‌రాజ్‌.. తేనం పోలీస్ లో స్టేష‌న్ ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను ఓ ఆర్టిస్ట్ చంపేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటుడు, నిర్మాత అయిన విశాల్, ఆయన స్నేహితుల్లో ఒకరైన హీరో కార్తీ ప్రస్తుతం నడిగర్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ కొనసాగుతుండగా.. కార్యదర్శిగా విశాల్.. మరో కీలక పదవిలో కార్తీ కొనసాగుతున్నారు. అయితే వీరిపై నటుడు రాజా దురై ద్వేషం పెంచుకొని వారిద్దరినీ చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో న‌డిగ‌ర్ సంఘంలోని ఆఫీస‌ర్ ధ‌ర్మ‌రాజ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తేనం పిలీసులు విచారణ చేపట్టారు. విశాల్, కార్తీలను అవమానపరిచేలా రాజా దురై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని ధర్మ రాజ్ కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక విశాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘లాఠీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు కార్తీ ‘సర్ధార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus