అందరి కళ్లు ఆ డేట్ పైనే!

రాబోయే సంక్రాంతికి చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. దీనికి మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే బజ్ పెరిగిపోతుంది. అందరి దృష్టి సంక్రాంతిపైనే ఉంది. అయితే అంతకంటే ముందే భారీ కాంపిటీషన్ రెడీ అవుతోంది. డిసెంబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 23న కొన్ని సినిమాలు పోటీ పడబోతున్నాయి. రవితేజ ‘ధమాకా’సినిమాను అదే రోజున విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

నిఖిల్ ’18 పేజెస్’ కూడా అదే డేట్ న రానుంది. రణవీర్ సింగ్ ‘సర్కస్’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అది కూడా డిసెంబర్ 23నే రానుంది. ఇప్పుడు అదే లిస్ట్ లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ల ‘మెర్రి క్రిస్మస్’ కూడా చేరింది. ‘అందాధున్’ లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇన్ని సినిమాలతో పాటు సమంత ‘శాకుంతలం’ని కూడా అదే సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

అయితే ఇంత భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ చేసే ఛాన్స్ లేదని కూడా వాదించేవారు ఉన్నారు. ఈ సినిమా మొత్తం సమంత ఇమేజ్ మీదే మార్కెట్ చేయాలి కాబట్టి సోలో రిలీజ్ కోసం చూసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 21న అన్నీ మంచి శకునములే’ అనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఆ డేట్ న సినిమా రాకపోతే డిసెంబర్ 30కి రావొచ్చు. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తయితే..

డిసెంబర్ 16న ‘అవతార్ 2’ రాబోతుంది. ఈ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే.. థియేటర్లు కూడా పెంచేస్తారు. అంటే ఆ తరువాత రిలీజ్ అయ్యే టాలీవుడ్ సినిమాలకు థియేటర్లు దొరకడం సవాల్ గా మారుతుంది. మరేం జరుగుతుందో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus