‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనుక లోతైన అర్ధం ఉందని.. అదేంటో త్వరలోనే తెలియజేస్తానని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ”మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సాధ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్ధం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా” అంటూ రాసుకొచ్చారు.
‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీ చేసి ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా.. 8 మంది ప్రకాష్ రాజ్ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాలు బయటకొచ్చిన తరువాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయని.. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు,
కానీ పోటీ చేయకూడదా..? నేను తెలుగువాడిని కాకపోవడం నా తప్పు కాదంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. విష్ణు గెలుపుని స్వాగతిస్తూనే.. తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఈ రాజీనామాను స్వీకరించనని మంచు విష్ణు అన్నారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు