Deepika Padukone, Alia Bhatt: దీపికా, అలియా మెన్స్ వాష్ రూమ్ లోకి వెళ్లారట!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రస్తుతం తను నటించిన ‘గెహ్రాయా’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శకున్ బత్రాతో పాటు అనన్య పాండే, సిద్ధార్థ్‌ చతుర్వేదిలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది దీపికా. ఇందులో భాగంగా ఆమె కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. అలియా భట్‌తో కలిసి విదేశాల్లో ఓ మ్యూజిక్‌ కాన్సెర్ట్ కు వెళ్లిన సమయంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటనను దీపికా పంచుకుంది.

‘బెర్లిన్’లో జరిగిన కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సెర్ట్ కు అలియాతో పాటు కలిసి వెళ్లిందట దీపికా పదుకోన్. ఇద్దరూ కలిసి రెస్ట్ రూమ్ కి వెళ్లగా.. ఉమెన్స్ బాత్రూమ్ ముందు పెద్ద క్యూ ఉందట. అంత టైం వెయిట్ చేయలేక.. పక్కనే ఉన్న మెన్స్ వాష్ రూమ్ కి వెళ్లారట. అవి చాలా డర్టీగా ఉన్నాయని.. కానీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది దీపికా. అర్జెంట్ గా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడైనా ఉపయోగించాల్సిందే అని చెప్పింది దీపికా పదుకోన్.

తను, అలియా కలిసినప్పుడు ఆ సంఘటనను సరదాగా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటామని చెప్పింది దీపికా. ఇదిలా ఉండగా ‘గెహ్రాయా’ సినిమాలో దీపికా పదుకోన్ లీడ్ రోల్ పోషించింది. ఇందులో ఆమె యంగ్ హీరో సిద్ధార్థ్‌ చతుర్వేదితో ఇంటిమేట్ సీన్స్ లో నటించింది. ఈ సినిమా ట్రైలర్ బాగా వైరల్ అయింది. మరోపక్క దీపికా.. ‘ప్రాజెక్ట్ K’, ‘పఠాన్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా కూడా సైన్ చేసింది ఈ బ్యూటీ.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus