యాసిడ్ దాడి బాధితులు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ప్రముఖ నటి దీపికా పదుకోన్ ‘ఛపాక్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దీపికా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉండగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ సినిమాపై స్పందించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అందులో ‘ఛపాక్’ సినిమా ట్రైలర్ ని చూశానని.. అది చూడగానే తన సోదరి రంగోలీ గుర్తుకు వచ్చిందని చెప్పారు. రంగోలీ కూడా యాసిడ్ దాడి బాధితురాలేనని.. ఆ యాసిడ్ దాడి ఇప్పటికీ తమ కుటుంబాన్ని ఎంతగానో బాదిస్తుందని చెప్పుకొచ్చారు. యాసిడ్ దాడి బాధితురాలి కథతో ఓ గొప్ప కథను ప్రేక్షకులకు అందిస్తున్న దీపికా, మేఘనా గుల్జార్ లకు ధన్యవాదాలు చెప్పారు. యాసిడ్ దాడులు లేని దేశంగా మన దేశం మారాలని చెప్పారు. అలానే ‘ఛపాక్’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంగనా ‘పంగా’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె కబడ్డీ ప్లేయర్ గా కనిపించనుంది. అశ్వినీ అయ్యర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The pain still lingers. Our family thanks team #chhapaak for a story that needs to be told! @deepikapadukone @meghnagulzar @foxstarhindi pic.twitter.com/drKN3i6GSP
— Rangoli Chandel (@Rangoli_A) January 8, 2020
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!