బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచంలోనే శక్తివంతుల జాబితాలో చేరిన దీపిక పడుకొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. ఈ ఏడాది కూడా దీపిక టైమ్స్-100 జాబితాలో చోటు దక్కడం ఆనందంగా ఉందనీ తెలిపారు.అయితే ఈసారి నటిగా కాకుండా నాలోని శక్తివంతమైన స్త్రీకి ఈ గుర్తింపు లభించిందని ఈమె తెలియజేశారు. 18 సంవత్సరాలకే మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన దీపిక ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తనలో చాలా భయం కలిగిందని, నేను నిజంగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలన అనే భయం తనను వెంటాడిందని దీపిక వెల్లడించారు. కెరియర్ మొదట్లో నన్ను తొక్కేస్తా రేమో అనే భయం కూడా తనలో కలిగిందని ఈమె వెల్లడించారు. ఈ విధంగా తనలో ఎన్నో తలెత్తిన ప్రశ్నలకు సమాధానం నేడు నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండటమే అంటూ తెలిపారు. ఇక కరోనా వచ్చిన సమయంలో చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
కొందరు వారి ఆత్మీయులను కోల్పోయారు. కానీ నేను మాత్రం రణవీర్ కి మరింత దగ్గరయ్యాను. నిత్యం షూటింగ్లతో బిజీగా గడిపే తనకు కరోనా తన కుటుంబంతో గడిపే అవకాశం ఇచ్చిందని ఈ సందర్భంగా దీపికా తెలియజేశారు. ఇకపోతే లాక్ డౌన్ సమయంలో తనకు డబ్బు విలువ, ఆత్మీయులు విలువ, సమయం విలువ ఏమిటో తెలియజేసింది.
చివరికి మనం పీల్చే గాలి విలువ ఏంటో కూడా ఆ సమయంలోనే తెలుసుకున్నానని, కరోనా ఎన్నో విలువలను నేర్పిందని ఈమె తెలిపారు.కరోనా సమయంలో మా కుటుంబం, రణవీర్ కుటుంబం మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలియజేశారు.