Deepika Padukone: జీవితం పై విరక్తి.. బతకాలనిపించలేదు దీపిక ఎమోషనల్ కామెంట్స్?
- October 30, 2022 / 06:32 PM ISTByFilmy Focus
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపికా గురించి పరిచయం అవసరం లేదు. అయితే ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె ఎన్నోసార్లు చనిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ గతంలో ఎన్నోసార్లు తన జీవితంలో ఎదుర్కొన్న చేత సంఘటనల గురించి బయటపెట్టారు. తాజాగా దీపిక మరోసారి తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే దీపికా పదుకొనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న మానసిక ఇబ్బందులను గురించి బయట పెట్టారు.
2014వ సంవత్సరంలో తాను మొదటిసారిగా తన మనోవ్యాధిని గుర్తించానని ఈమె తెలిపారు.అకస్మాత్తుగా తనకు ఏదో చిత్రవిచిత్రంగా అనిపించదని ఎలాంటి పనులు చేయాలనిపించేది కాదని ఈమె తెలిపారు. బయటకు వెళ్లాలన్న ఎంత చిరాకుగా అనిపించేదనీ తెలిపారు. చాలాసార్లు నా జీవితానికి ఏం అర్థం లేదని జీవితంపై విరక్తితో చనిపోవాలని కూడా అనుకున్నాను అంటూ ఈమె తెలిపారు. ఒకసారి తన తల్లిదండ్రులు తనని చూడటానికి బెంగుళూరు నుంచి రాగా వాళ్లు తిరిగి వెళ్లే సమయంలో ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా ఏడ్చానని ఈమె తెలిపారు.

తన ఏడుపులో ఏదో తేడా ఉందని గుర్తించిన తన తల్లి బెంగుళూరు వెళ్లకుండా తనతోనే ఉండిపోయింది అని తెలిపారు. ఇక తన తల్లి తనలో ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి తనని ఒక సైకియార్టిస్టు దగ్గరకు తీసుకువెళ్లిందని ఇలా మందులు వాడిన తర్వాత కొన్ని నెలలకు గాను తిరిగి కోలుకోవడానికి సాధ్యం కాలేదని తెలిపారు.

ఇలా మనో వ్యాకులత సమస్య నాకే ఉందనుకుంటే నాలాంటివారు ఎంతోమంది ఉంటారు అనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడిన నా జీవితానికి సార్థకత ఉంటుందని అనుకుంటున్నా అంటూ ఈమె గతంలో తనకు జరిగిన చేదు సంఘటన గురించి బయటపెట్టారు.
జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!












