అప్పట్లో ఉండటానికి చిన్న గది కూడా ఉండేది కాదు: స్టార్‌ హీరోయిన్‌

సినిమా నటలు జీవితం ఎప్పుడూ పూల పాన్పు కాదు అంటుంటారు. ఓ స్థాయికి ఎదగడానికి వాళ్లు పడే కష్టం, ఆ తర్వాత దానిని నిలబెట్టుకునే కష్టం కంటే… తొలి అవకాశం, సరైన సినిమా కోసం పడే కష్టం చాలా పెద్దది అని చెప్పొచ్చు. తారు రోడ్డు ఎక్కాక.. దాటిని గతుకుల మట్టి రోడ్డును మరచిపోకుండా ముందుకెళ్లే వాళ్లే బాగుపడతారు అన్నట్లు.. నటులు కూడా పాత దారిని గుర్తుంచుకుంటారు. అందుకే స్టార్‌ నటులు అవుతారు. అలాంటి ఓ స్టార్‌ నటి తన ఎర్లీ లైఫ్‌ గురించి కొన్ని విషయాలు చెప్పింది.

ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి. 17 ఏళ్ల వయసులో అంటే లోకం పోకడలు సరిగ్గా తెలియని వయసులో కలల కెరీర్‌ కోసం బెంగళూరు నుండి ముంబయిలో అడుగు పెట్టింది దీపికా పడుకొణె (Deepika Padukone) . ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ ఇమేజిని అందుకుంది. అయితే తొలి రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చింది. సినిమాలంటే మొదట్నుండీ ఇష్టమే అని, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నానా అని అనిపిస్తుంటుంది అని చెప్పింది.

సినిమాలే నా కెరీర్‌ అని మనసులో అనుకోగానే తేలిగ్గా ఇంట్లోంచి బయటికొచ్చేశాను. ఆ సమయంలో నాకు కనీసం చిన్న గది కూడా లేదు. తెలిసినవాళ్ల దగ్గరో, మోడలింగ్‌ షూటింగ్‌ స్పాట్‌లోనో ఉంటూ… రాత్రింబవళ్లు పని చేస్తూనే ఉండేదాన్ని అని ఎర్లీ డేస్‌ను గుర్తు చేసుకుంది దీపికా పడుకొణె. అలా ఆ సమయంలో ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్‌ (Farah Khan) దృష్టిలో పడి ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అవకాశం దక్కించుకున్నా అని చెప్పింది.

ఇక ప్రజెంట్‌ సంగతి చూస్తే… దీపిక పడుకొణె ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), ‘సింగం అగైన్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో తేదీల విషయంలో క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus