ప్రభాస్ 21 అప్డేట్ ఫ్యాన్స్ కి అంత కిక్ ఇవ్వలేదట!

అనుకోకుండా, ఎలాంటి సందర్భం లేకుండా ప్రభాస్ 21 అప్డేట్ అంటూ హడావుడి మొదలైంది. గత రాత్రి నిర్మాత అశ్వినీ దత్ నేడు 11:00 గంటలకు సర్ప్రైజ్ ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ గత రాత్రి నుండి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తీరా ఆ అప్డేట్ చూశాకా ఉసూరు మన్నారు. దానికి కారణం…అది అందరికీ తెలిసిన అప్డేట్ కావడమే, కాకపోతే అధికారికంగా వచ్చింది.

దాదాపు గత రెండు నెలలుగా ప్రభాస్ 21 మూవీలో దీపికా పదుకొనె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. రెండు నెలలుగా నలుగుతున్న విషయం ఫ్యాన్స్ కి సగటు సినీ ప్రేక్షకులకు పెద్ద సర్పైజ్ గా అనిపించలేదు. ఐతే దీపికా పదుకొనె ను తీసుకోవడం ద్వారా ఈ మూవీ స్కేల్ చాలా పెద్దది అని మాత్రం అర్థం అయ్యింది. టాలీవుడ్ లో దీపికా పక్కన నటిస్తున్న మొదటి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.

ఇక ఈ మూవీపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉండగా, జోనర్ పై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022 సమ్మర్ లో విడుదల కానుంది. 500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా దీపికా పదుకొనె హీరోయిన్ గా తీసుకొని మూవీపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లారు.


చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus