ప్రేమ వ్యవహారాలు అనేవి అందరి జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. సినీ ప్రముఖుల విషయాల్లో ఇవి మరీ సాధారణం అయిపోయాయి. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ నటి దీపికా పడుకొనె గతంలో ఎన్నో ప్రేమ వ్యవహారాలు నడిపిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్- యువరాజ్ సింగ్- సిద్ధార్థ్ మాల్యా .. ఇంకా చాలా పేర్లు ఈ లిస్ట్ లో వినిపించాయి. వీటిలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తో నడిపిన ప్రేమాయం మాత్రం బాగా హైలెట్ అయ్యింది.
దీపికా బెస్ట్ లవ్, కచ్చితంగా ఇతన్నే పెళ్ళి చేసుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో బాలీవుడ్ మీడియాకి రోజూ దీపికా.. రణబీర్ తో ఉన్న ఏదో ఒక ప్రేమ గురించి న్యూస్ ఇచ్చేది. ఏకంగా ‘ఆర్ కె’ అంటూ తన మెడ పై టాటూ కూడా వేయించుకుంది. అయితే అనూహ్యంగా రణవీర్ సింగ్ ను పెళ్ళి చేసుకుంది. ఇక పెళ్ళి తరువాత హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న దీపిక.. రణబీర్ ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది అంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి.
కానీ ఆ వార్తలకు తన టాటూతో ఫుల్ స్టాప్ పెట్టింది అనే చెప్పాలి. ‘చపక్’ ప్రమోషన్స్ కు వచ్చిన దీపిక .. తన మెడ పై టాటూ లేకుండా కనబడి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఆ టాటూని ఎలా చెరిపేసింది అని చాలా మందికి అనుమానం కలిగింది. నిజంగానే చెరిపేసిందా.. లేక ఆ టాటూ కనబడకుండా మేకప్ వేసిందా అనేది పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయమై దీపికను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటేసిందట. ఇప్పుడు తను పెళ్ళి చేసుకుంది కాబట్టి ఈ విషయం పై ఏక్కువ డిస్కస్ చెయ్యడం సరికాదు అని సమాధానం చెప్పకుండా దాటేసింది అంటూ కొందరు చెబుతున్నారు.