Deepthi Sunaina, Shanmukh: షణ్ముఖ్ ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన దీప్తి సునైనా!

గత కొన్నిరోజులుగా షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా విడిపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీప్తి సునైనా సోషల్ మీడియా పోస్టులు సైతం ఆమె నిజంగానే షణ్ముఖ్ తో విడిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయి. అయితే న్యూ ఇయర్ రోజున షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు దీప్తి సునైనా అధికారిక ప్రకటన చేశారు. అర్ధరాత్రి సమయంలో దీప్తి సునైనా చేసిన పోస్ట్ షణ్ముఖ్ అభిమానులను షాక్ కు గురి చేసింది.

లవ్ బ్రేకప్ తో దీప్తి సునైనా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం గమనార్హం. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో దీప్తి సునైనా చేసిన సుధీర్ఘమైన పోస్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. దీప్తి సునైనా ఆ పోస్ట్ లో ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పరస్పర అంగీకారంతో తాను, షణ్ముఖ్ విడిపోయి ఎవరి జీవితం వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలలో మేము చాలా సంతోషంగా ఉన్నామని మాలోని రాక్షస గుణాలతో పోరాడామని దీప్తి సునైనా కామెంట్లు చేశారు.

ఫైనల్ గా మీరు కోరుకున్న విధంగానే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నామని దీప్తి సునైనా వెల్లడించారు. ఇది చాలాకాలంగా కొనసాగుతోందని ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నించామని అయితే జీవితానికి ఏమి కావాలో వాటిని విస్మరించామని దీప్తి సునైనా అన్నారు. ఇద్దరు దారులు వేరని తెలుసుకుని అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించామని దీప్తి సునైనా కామెంట్లు చేశారు. ఇది మాకు క్లిష్ట సమయమని మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నానని దీప్తి సునైనా తన పోస్ట్ లో పేర్కొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన వల్లే షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య బ్రేకప్ జరిగిందని చాలామంది భావిస్తున్నారు. బ్రేకప్ గురించి షణ్ముఖ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ బ్రేకప్ వల్ల కొంతమంది సిరి గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus