Deepthi Sunaina: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీప్తి సునైనా … ఫోటోలు వైరల్!

యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికీ సుపరిచితమే.ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దీప్తి సునయన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా అవకాశం అందుకున్నారు. అయితే ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

ఇక ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని సందడి చేశారు. అయితే ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ వ్యవహార శైలి కారణంగా తాను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పింది. ఇలా దీప్తి సునయన షణ్ముఖ్ ఇద్దరు విడిపోవడంతో అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వీరిద్దరూ కలిస్తే బాగుండని ఆశపడ్డారు. ఇక ఈ కోరిక ఇప్పుడే నెరవేరేదని వీరిద్దరూ తిరిగి కలిసే సూచనలను కూడా లేవని అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

దీప్తి సునైనా కూడా కొత్త ఇల్లును కొనుగోలు చేయడమే కాకుండా కొత్త ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి అభిమానులు దీప్తి సునయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus