Degala Babji Review: డేగల బాబ్జీ సినిమా రివ్యూ & రేటింగ్!

బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘డేగల బాబ్జి’. తమిళ్ లో నటుడు పార్థిబన్ హీరోగా ‘ఉత్త సెరుప్పు సైజ్ 7’ అనే సినిమా 2019లో విడుదలైంది. ఆ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సినిమానే ఈ ‘డేగల బాబ్జి’. ఈ చిత్రంలో బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్నాడు అంటూ మొదట ప్రచారం జరిగింది. దాంతో అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. ’49 ఏళ్ళ వయసులో బండ్ల గణేష్ హీరోగా చేయడం ఏంటి’ అని అంతా అనుకున్నా ఓ కొత్త ఎక్స్పెరిమెంట్ గా ఉంటుందని వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ‘డేగల బాబ్జి’ చిత్రం టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత జనాల్లో ఆసక్తి లోపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు సినిమా రిలీజ్ అయినా దీని గురించి పట్టించుకున్నవాళ్లు లేరు. సరే ఇంతకీ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డేగల బాబ్జీని (బండ్ల గణేష్) ప్రధాన నిందితుడుగా భావించి అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు.ఇన్వెస్టిగేషన్లో ఈ మర్డర్ కూడా తనే చేసినట్టు ఒప్పుకుంటాడు బాబ్జీ.అంతేకాదు ఇంకొన్ని మర్డర్స్ కూడా చేసినట్లు అతను పోలీసులకు తెలియజేస్తాడు. బాబ్జీ ఇన్వెస్టిగేషన్లో ఎందుకు అలా చెప్పాడు? అసలు ఇతని చేతిలో హత మార్చబడిన వాళ్ళు ఎవరు? మరికొంత మందిని కూడా చంపినట్టు అతను చెబుతున్నాడు. అసలు ఏ ఉద్దేశంతో అతను ఇలా చెప్పాడు? చివరికి ఇతన్ని పోలీసులు ఏం చేశారు? ఉరితీశారా? లేక వదిలేశారా? అనే సస్పెన్స్ అంశాలతో కథని నడిపించాడు దర్శకుడు.

నటీనటుల పనితీరు: ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డు పడే వరకు బండ్ల గణేష్ మత్రమే కనిపిస్తాడు. మిగిలిన నటీనటుల వాయిస్ లు వినిపిస్తాయి తప్ప వాళ్ళ మొహాలు చూపించరు. కాబట్టి బండ్ల గణేష్ వన్ మాన్ షో మూవీ లాంటిది ఇది. కొన్ని సీన్స్ లో ఎమోషన్ బాగా పండించాడు బండ్ల గణేష్. కానీ ‘ఉత్త సెరుప్పు సైజ్ 7’ లో పార్తిబన్ లా అయితే కాదు. అతనికి నేషనల్ అవార్డు ఎందుకు లభించిందో ఆ చిత్రం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా మొత్తం అతనే ఉన్నా.. ఎంగేజ్ చేస్తాడు.

మిగిలిన నటీనటులు లేరే అనే ఆలోచన రానివ్వడు. ప్రయోగాత్మక చిత్రాలకి తమిళంలో పెద్దపీట వేస్తారు కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగుకి వచ్చేసరికి రిజల్ట్ ను పక్కన పెట్టేసి కనీసం జనాలను థియేటర్లలో కూర్చోవాలి అంటే ఆ స్థాయిలో రంజింప జేసే నటుడు కావాలి. బండ్ల గణేష్ పూర్తి స్థాయిలో ఈ మూవీకి పర్ఫెక్ట్ అనడానికి లేదు. కానీ కొంతవరకు న్యాయం చేసాడు. అతని పలికిన కొన్ని డైలాగులు కూడా బాగున్నాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఒక్క బండ్ల గణేష్ తప్ప సినిమాలో మిగిలిన నటీనటులు ఎవ్వరూ లేరు కాబట్టి టెక్నికల్ టీంకి ఎక్కువ పని పడింది. వాళ్ళ వరకు జస్ట్ ఓకె అనిపించారు కానీ బెస్ట్ అనే విధంగా అయితే చేసినట్లు లేరు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సంగీత దర్శకుడు లైనస్ మధిరి ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.అరుణ్ దేవినేని సినిమాటోగ్రఫీ కూడా భారీగా ఎట్రాక్ట్ చేసే విధంగా లేదు.

నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. ఒరిజినల్ కనుక చూసుకుంటే.. అక్కడ కూడా ఒక్క పోలీస్ స్టేషన్ లోనే సినిమా జరిగినా విజువల్స్ క్వాలిటీగా ఉంటాయి. తెలుగులో అలా అనిపించలేదు. నిర్మాతలు ఇక్కడ పొదుపుగా వ్యవహరించారేమో అనిపించకమానదు..

విశ్లేషణ : బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్.. అది ట్రోల్ చేసే వారు కానీ, అభిమానించే వారు కానీ.. ఈ మూవీని ఓటీటీలో అయితే ట్రై చేయొచ్చు. అది కూడా బండ్ల గణేష్ యావరేజ్ పెర్ఫార్మన్స్ కోసం. ‘ఈ సినిమా తర్వాత తనకి రెస్పెక్ట్ పెరుగుతుందని.. దీనికోసమే 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను అని’ ప్రమోషన్లలో బండ్ల గణేష్ చెప్పాడు. అతని పై రెస్పెక్ట్ జనాల్లో ఉంది కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు తనే నిర్మాతగా వ్యవహరించి క్వాలిటీ విజువల్స్ ఉండేలా జాగ్రత్త పడితే కచ్చితంగా అతని పై ఇప్పుడున్న గౌరవం మరింతగా పెరుగుతుంది అనేది వాస్తవం.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus