తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేసిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి 5 ఏళ్ళ పాటు కష్టపడి 2 భాగాలుగా తీసిన ఈ సినిమాని… రీ రిలీజ్ కోసం ఒక పార్ట్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ‘బాహుబలి'(ది బిగినింగ్) ‘బాహుబలి 2′(బాహుబలి ది కన్ క్లూజన్) సినిమాలను కలిపితే దాదాపు 6 గంటల వరకు రన్ టైం వస్తుంది.
కానీ ‘బాహుబలి ది ఎపిక్’ ని 3 గంటల 47 నిమిషాల రన్ టైంతో రిలీజ్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఏ ఏ సీన్లు రాజమౌళి కట్ చేసి ఉంటారు? ఎవరి పోర్షన్ ఎక్కువగా పోయుంటుంది? వంటి ప్రశ్నలు చాలానే సోషల్ మీడియాలో చర్చలకు దారి తీశాయి. అయితే వీటికి దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ విషయం పై రాజమౌళి మాట్లాడుతూ…” ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలు రోలింగ్ టైటిల్స్ అవి తీసేస్తే.. 5 గంటల 30 నిమిషాల సినిమా ఉంటుంది. ఇప్పుడు ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా 3 గంటల 47 నిమిషాలు. మొదటి పార్ట్ లో ఉండే అవంతిక లవ్ స్టోరీ తీసేశాను. ‘పచ్చబొట్టేసిన’ సాంగ్ తో సహా..! సెకండ్ పార్ట్ లో ‘కన్నా నిదురించరా’ సాంగ్ నాకెంతో ఇష్టమైనప్పటికీ అది తీసేశాను.
అలాగే ‘మనోహరి’ సాంగ్ కూడా తీసేశాను. అలాగే యుద్ధం ఎపిసోడ్లో ఇద్దరికీ(ప్రభాస్,రానా) సంబంధించిన విజువల్స్ చాలా కట్ చేయడం జరిగింది” అంటూ అసలు మేటర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
