బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పలు కంపెనీలు తన అనుమతి లేకుండా తన ఫోటోలు తన వాయిస్ తన పేరును ఉపయోగించుకుంటున్నారు అంటూ ఈయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేశారు. ఇలా అమితాబ్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన హైకోర్టుఅమితాబ్ పేరును కానీ ఫోటోలు కానీ లేదా తన వాయిస్ కానీ అనుమతి లేకుండా వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఫేక్ కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) లాటరీ స్కామ్‌లో అమితాబ్ బచ్చన్ ఫోటోగ్రాఫ్‌లు, వాయిస్‌ను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కొన్ని టీషర్ట్లపై కూడా అమితాబచ్చన్ అనుమతి లేకుండా తన ఫోటోలను ముద్రిస్తున్నారనీ, ఈ చర్యలను అరికట్టి తన ప్రచార హక్కులను కాపాడాలి అంటూ ఈ సందర్భంగా అమితాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది తన సెలబ్రిటీ హోదాకు పూర్తిగా వ్యతిరేకం అంటూ ఈయన పిటిషన్లు పేర్కొన్నారు.జస్టిస్ నవీన్ చావ్లా విచారణ జరిపిన అనంతరం టెలికాం శాఖ అధికారులు,
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలను జారీ చేస్తూ ప్రచార హక్కులను ఉల్లంఘించినందుకు టెలికాం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖపై దావా వేయడమే కాకుండా లింకులు వెబ్సైట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై ఎవరూ కూడా అమితాబ్ పరిమిషన్ లేకుండా ఆయన ఫోటోలు కానీ లేదా ఆయన పేరును కానీ అలాగే తన వాయిస్ కూడా ఉపయోగించడానికి వీలు లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఇలా అనుమతి లేకుండా ఆయన పరపతిని ప్రచారం కోసం ఉపయోగించుకుంటే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని ప్రకటించారు.