Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

తమిళ దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘ డిమోంటి కాలనీ’ (Demonte Colony) ‘అంజలి సీబీఐ’ (Anjali CBI) వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ‘డిమోంటి కాలనీ’ చిత్రాన్ని టీవిలో ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘డిమాంటి కాలనీ 2’ ని తీసుకొచ్చాడు అజయ్. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ విడుదల చేసింది.

Demonte Colony 2 Collections

ఆగస్టు 23 న తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి. ఒకసారి (Demonte Colony 2 Collections) మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.45 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్ ) 0.33 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 0.98 cr

‘డిమోంటి కాలనీ 2’ చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.0.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కృష్ణాష్టమి హాలిడే ఉంది కాబట్టి.. ఈరోజు కూడా బాగా కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి.

నాగార్జునను ఉద్దేశించి బాలయ్య అలా చెప్పారా.. అసలేమైందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus