Balakrishna: నాగార్జునను ఉద్దేశించి బాలయ్య అలా చెప్పారా.. అసలేమైందంటే?

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెల్సిందే. కొంతమంది నాగార్జునను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ షోకు నాగార్జున (Nagarjuna)   హోస్ట్ గా వ్యవహరించకూడదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది. ఈ వివాదం విషయంలో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. అయితే బాలయ్య (Balakrishna) 2020 సంవత్సరంలో చేసిన కామెంట్లను అభిమానులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

Balakrishna

లాక్ డౌన్ సమయంలో బాలయ్య తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున మరి కొందరు హీరోలు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపగా భూములు పంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్లంతా కలిశారు అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు ట్రెండింగ్ లో నిలిచాయి. మీటింగ్ కు బాలయ్యను ఆహ్వానించకపోవడంతో బాలయ్య ఈ కామెంట్స్ చేయడం జరిగింది.

అప్పట్లో నాగ్ ను టార్గెట్ చేసి బాలయ్య ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం ఈ వివాదం విషయంలో ఒకింత సైలెంట్ గా ఉన్నారు. నాగార్జున కెరీర్ పై కూడా ఈ వివాదం ప్రభావం కొంతమేర పడే అవకాశాలు అయితే ఉంటాయి. వ్యాపారవేత్తగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాగార్జున కెరీర్ లో ఈ వివాదం మచ్చలా నిలిచింది.

రాబోయే రోజుల్లో పరిస్థితులు నాగార్జునకు అనుకూలంగా మారితే మాత్రం అభిమానులు ఎంతో సంతోషంగా ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో నాగార్జున బిగ్ బాస్ సీజన్8 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం నాగార్జున కుబేర అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఆ సినిమాలన్నీ బాషా మూవీ నుంచి పుట్టాయన్న ఎస్జే సూర్య.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus