బిగ్ బాస్ 4: ఇంట్లో దెయ్యం..! అరియానా భయం..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా జలజ అనే దెయ్యాన్ని పరిచయం చేశాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో సెట్ వర్క్ కోసం తలుపులు అన్నీ క్లోజ్ చేశారు. అందరూ కిచెన్ లో ఉండగా, ఒక్కసారిగా అరియానాకి అద్దంలో దెయ్యం కనిపించింది. దీంతో గజగజ వణుకతూ భయపడింది. ఆ తర్వాత అఖిల్, సోహైల్ , హారికలు ముగ్గురూ దెయ్యంతో కాసేపు ఆడుకున్నారు.

సోహైల్, హారిక ఇద్దరూ దెయ్యాన్ని మళ్లొక్కసారి కనిపించు దమ్ముంటే అంటూ రెచ్చిపోయి డైలాగ్స్ వేశారు. దేత్తడి అయితే, దెయ్యంతో ఛాలెంజ్ కూడా చేసింది. ఇదే టైమ్ లో హౌస్ లోకి స్మోక్ రావడం, గజ్జెల సౌండ్ వినిపించడం ఇవన్నీ గమనించి ఇది హార్రర్ టాస్క్ అని డిసైడ్ అయ్యారు హౌస్ మేట్స్.

తర్వాత అందరూ హౌస్ లోకి దెయ్యంగా వచ్చిన జలజ గొంతు విని లివింగ్ రూమ్ లో కూర్చున్నారు. అందరూ వైల్డ్ కార్డ్ ద్వారా స్వాతి వచ్చిందా అనే గెస్ వర్క్ చేశారు. కానీ దెయ్యం అభిజిత్ కి, సోహైల్ కి టాస్క్ లు ఇచ్చింది. దీంతో మేము బిగ్ బాస్ చెప్తేనే టాస్క్ చేస్తాం.లేదంటే చేయమని చెప్పారు.

గార్డెన్ ఏరియా ఓపెన్ అయిన తర్వాత సెట్ వర్క్ చూసి హౌస్ మేట్స్ అబ్బురపడ్డారు. కొద్దిటైమ్ లో ఇంత గొప్పగా సెట్ వేసినందుకు అభినందించారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి లేఖ పంపించాడు. అందులో అబిజిత్ – అఖిల్ మోనాల్ ని ఏడిపించినందుకుగానూ, మోనాల్ ని డేట్ కి తీస్కుని వెళ్లమని ఆదేశించాడు. కానీ ఇక్కడే అభిజిత్ మోనాల్ విషయంలో నన్ను దయచేసి ఇన్వాల్ చేయద్దని చెప్పుకున్నాడు. దీంతో మోనాల్ అఖిల్ తో డేట్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఎంటైర్ టాస్క్ లో అస్సలు అవినాష్ చేసిన ఫన్, దేత్తడి ధైర్యం, సోహైల్ పంచ్ లు ఆకట్టుకున్నాయి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus