Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Reviews » Deva Review in Telugu: దేవా సినిమా రివ్యూ & రేటింగ్!

Deva Review in Telugu: దేవా సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 31, 2025 / 04:36 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Deva Review in Telugu: దేవా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షాహిద్ కపూర్ (Hero)
  • పూజా హెగ్డే (Heroine)
  • పవైల్ గులాటి, ప్రవేశ్ రాణా తదితరులు.. (Cast)
  • రోషన్ ఆండ్రూస్ (Director)
  • సిద్ధార్థ్ రాయ్ కపూర్ - ఉమేష్ కె.ఆర్ బన్సల్ (Producer)
  • జేక్స్ బిజోయ్ - విశాల్ మిశ్రా (Music)
  • అమిత్ రాయ్ (Cinematography)
  • Release Date : జనవరి 31, 2025
  • జీ స్టూడియోస్ - రాయ్ కపూర్ ఫిల్మ్స్ (Banner)

2013లో కేరళలో చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా “ముంబై పోలీస్”. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో హీరో, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ ను స్వలింగ సంపర్కుడిగా చూపించడాన్ని అప్పటి మీడియా & గవర్నమెంట్ తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయ్యింది. ఆ సినిమాను తెలుగులో సుధీర్ బాబు “హంట్” (2023) అంటూ రీమేక్ చేసి చేతులు కాల్చుకోగా.. ఇప్పుడు అదే కథకు చిన్నపాటి మార్పులు చేసి “దేవా” (Deva) గా తెరకెక్కించాడు మలయాళ మాతృక దర్శకుడు రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews). షాహిద్ కపూర్ (Shahid Kapoor) టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. మరి ఈ మలయాళం సినిమా హిందీ రీమేక్ ఎలా ఉందో చూద్దాం..!!

Deva Review

Deva Movie Review & Rating!

కథ: ఓ కేసును ఛేదించే క్రమంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోతాడు దేవా (షాహిద్ కపూర్). ఆ కేసును మళ్లీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. ఆల్రెడీ గతం మర్చిపోవడం, ఛేదించిన కేసులో కీలకమైన విషయాలు మిస్ అవ్వడం కారణంగా బోలెడంత కన్ఫ్యూజన్ మొదలవుతుంది.

ఈ క్రమంలో దేవా ఆ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? తన ప్రాణ మిత్రుడ్ని చంపిందెవరో కనుక్కోగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “దేవా” చిత్రం.

Deva Movie Review & Rating!

నటీనటుల పనితీరు: విలనీ షేడ్ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా ఫుల్ ఎనర్జీతో దేవ పాత్రకి పూర్తిస్థాయి న్యాయం చేశాడు షాహిద్ కపూర్. ముఖ్యంగా క్యారెక్టర్లో కనిపించే మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ను చక్కగా పండించాడు షాహిద్. కీలకమైన పాత్రలో పవైల్ గులాటి ఆకట్టుకోగా.. డేరింగ్ జర్నలిస్ట్ గా పూజా హెగ్డే తక్కువ స్క్రీన్ టైమ్ లో అలరించే ప్రయత్నం చేసింది.

Deva Movie Review & Rating!

సాంకేతికవర్గం పనితీరు: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) నేపథ్య సంగీతం ఈ సినిమాకి మంచి ఎస్సెట్. ఎలివేషన్స్ & టెన్షన్ ను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు. పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. అమిత్ రాయ్ (Amit Roy) సినిమాటోగ్రఫీ వర్క్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మంచి మాసీ ఫీల్ ఇచ్చాయి. శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad)ఎడిటింగ్ టెక్నిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఎందుకంటే.. తెలిసిన కథను కాస్త ఆసక్తికరంగా నడిపించడంలో హెల్ప్ అయ్యింది.

ఇక రోషన్ ఆండ్రూస్ తన బాలీవుడ్ డెబ్యూకి కొత్త కథను కాకుండా.. 2013లో తాను తెరకెక్కించిన “ముంబై పోలీస్”ను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. స్క్రీన్ ప్లే & సీన్ కంపోజిషన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పులు ఉన్నప్పటికీ.. అదే సినిమాను మళ్లీ తీయడం ఎందుకు అనేది పెద్ద ప్రశ్న. అయితే.. ముంబై పోలీస్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముఖ్యకారణమైన గే యాంగిల్ ను సినిమా నుండి తొలగించి ఇన్ఫార్మర్ యాంగిల్ ని ఇరికించడంతో.. సినిమా సోల్ మిస్ అయ్యింది.

దాంతో.. షాహిద్ ఎంత బాగా నటించినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్ తో ట్రావెల్ అవ్వలేం. అది సరిపోదన్నట్లు.. ఎండింగ్ లో మళ్లీ జైల్ ఎలివేషన్ ఇరికించడం అనేది అస్సలు సింక్ అవ్వలేదు. “సెల్యూట్, హౌ ఓల్డ్ ఆర్ యు?, ప్రతి పూవంకోళి” వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన రోషన్ ఇలా తన ఓల్డ్ ఐడియా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి.. ఫెయిల్ అవ్వడం అనేది బాధాకరం.

Deva Movie Review & Rating!

విశ్లేషణ: కీలకమైన ట్విస్టును మార్చి రీమేక్ చేయడం అనేది ఎప్పడు అంగీకరించాలంటే.. ఒరిజినల్ ట్విస్ట్ కంటే ఈ కొత్త ఆలోచన బాగున్నప్పుడు. కానీ.. ఒరిజినల్ ట్విస్ట్ ఏమో అద్భుతంగా ఉంది, రీమేక్ లో కేవలం హీరో ఇమేజ్ కోసం దాన్ని మార్చడం, అది కూడా పేలవంగా ఉండడం అనేది సమంజసం కాదు. “దేవా” విషయంలో అదే జరిగింది. సినిమాకి ప్రాణమైన ట్విస్ట్ ను మార్చి తెరకెక్కించడంతో.. క్యారెక్టరైజేషన్ ఎంత బాగున్నా, ఓవరాల్ గా సినిమా ఆకట్టుకోలేకపోయింది.

Deva Movie Review & Rating!

ఫోకస్ పాయింట్: పన్నెండేళ్ల తర్వాత కూడా అదే కథ తీయాలా దేవా?!

రేటింగ్: 2/5

Click Here to Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva
  • #Pooja Hegde
  • #Rosshan Andrrews
  • #Shahid Kapoor

Reviews

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’  సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

trending news

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

4 hours ago
Madharaasi First Review: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Madharaasi First Review: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

10 hours ago
Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

10 hours ago
Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

1 day ago

latest news

Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

2 hours ago
Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

2 hours ago
Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

3 hours ago
Kotha Lokah: లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రూ.100 కోట్లు… సౌత్..లో ఇదే తొలిసారి

Kotha Lokah: లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రూ.100 కోట్లు… సౌత్..లో ఇదే తొలిసారి

5 hours ago
Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version