నాగార్జున మాటలు బట్టి చూస్తే దేవదాస్ హాలీవుడ్ కథే!

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. అక్కినేని నాగేశ్వరరావు ఎవరు గ్రీన్ మూవీ టైటిల్ పెట్టడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈనెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 27న చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా, నాని వైద్యుడిగా నటిస్తున్నట్లు వార్తలు బయటికి రాగానే ఇది హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని సినీ విశ్లేషకులు చెప్పడం ప్రారంభించారు.  హెరాల్డ్ రామిస్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ “ఎనలైజ్ దిస్” లో  రాబర్ట్ డీ నీరో, బిల్లీ క్రిస్టల్ ప్రధాన పాత్రలు పోషించారు. 1999లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మాఫియా డాన్ రాబర్ట్ డీ నీరో.. తనకున్న ఒక డిజార్డర్‌ను పోగొట్టుకోవడానికి సైకియాట్రిస్ట్ బిల్లీ క్రిస్టల్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఈ సినిమా లైన్.

ఇదే సినిమాను మలయాళంలో మమ్ముట్టి, శ్రీనివాసన్ ప్రధాన పాత్రధారులుగా “భార్గవ చరితం మూన్నాం ఖండం” పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు ఆ పాత్రలను నాగ్, నాని తనదైన శైలిలో పోషించబోతున్నారు.  చిత్ర బృందం ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా తాజాగా నాగ్ మాటలను బట్టి చూస్తే “దేవదాస్” చిత్రం నిజంగా హాలీవుడ్ మూవీ స్ఫూర్తి తోనే తెరకెక్కినట్టు అర్ధమవుతోంది. ఇటీవల “చి.ల.సౌ” మూవీ ప్రమోషన్లో నాగ్ మాట్లాడుతూ…”దేవదాస్’ సినిమా మేము అనుకున్నట్టు హిట్టయితే దీనికి సీక్వెల్ స్టోరీ కూడా రెడీగా ఉంది” అని చెప్పారు. “ఎనలైజ్ దిస్” సినిమాకి “ఎనలైజ్ దట్” అనే సీక్వెల్ మూవీ ఉండడంతో.. ఈ సినిమా కచ్చితంగా రీమేక్ అని బలంగా నమ్ముతున్నారు. మరి “దేవదాస్” చిత్రం సొంత కథ, అద్దె కథ అనేది కొన్ని రోజుల్లోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus