Devara: దసరా సెలవుల వల్ల దేవర బయ్యర్లకు భారీ లాభాలు ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) మూవీ మిక్స్డ్ టాక్ తో మొదలై కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. సోమ, మంగళవారాల్లో దేవర కలెక్షన్ల విషయంలో డ్రాప్ కనిపించినా ఈరోజు బుకింగ్స్ పుంజుకోవడం దేవర సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దసరా సెలవుల వల్ల దేవర బయ్యర్లకు భారీ లాభాలు ఖాయమని తెలుస్తోంది. అటు హైదరాబాద్ లో ఇటు ఏపీలోని మెజారిటీ ప్రాంతాల్లో దేవర మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

Devara

దేవర మూవీ కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 90 శాతానికి పైగా కలెక్షన్లను సాధించింది. కొన్ని ఏరియాలలో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. నార్త్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కావడం దేవరకు ఎంతో ప్లస్ అని చెప్పవచ్చు. దేవర సినిమా సీక్వెల్ పై ప్రస్తుతం పెద్దగా ఆసక్తి లేకపోయినా రాబోయే రోజుల్లో ఆసక్తి పెరిగే అవకాశాలు ఉంటాయి.

దేవర సీక్వెల్ రిలీజ్ కావడానికి కూడా చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. జక్కన్న (S. S. Rajamouli) నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సినిమాగా దేవర నిలవడంతో పాటు ఈ సినిమా ఎన్నో పాజిటివ్ సెంటిమెంట్లను నిజం చేసింది. ఫ్లాప్ డైరెక్టర్లకు తారక్ అవకాశాలు ఇస్తూ తన రేంజ్ పెంచుకుంటున్నారు.

తారక్ ఛాన్స్ ఇచ్చిన దర్శకులలో చాలామంది దర్శకులు తమను తాము ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా ఎదగడం జరిగింది. దేవర సక్సెస్ మీట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దేవర సక్సెస్ మీట్ కు ఏపీ రాజకీయ ప్రముఖులు గెస్ట్ లుగా హాజరయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నందమూరి వారసుడి వంద కోట్ల ఎంట్రీ.. ‘సింబా’ కోసం రిస్క్‌ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus