Devara: దేవర విషయంలో ఆ రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు ఇష్టపడలేదా?

సాధారణంగా పెద్ద సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువైన విషయం కాదు. దేవర (Devara) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా బిజినెస్ విషయంలో నిర్మాతలు మరీ ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల అన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.200 కోట్ల కంటే తక్కువని తెలుస్తోంది.

Devara

దేవర సినిమాకు సంబంధించి విడుదలవుతున్న కొత్త పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ వెర్షన్ పోస్టర్స్ లో తారక్ (Jr NTR)  తో పాటు సైఫ్ (Saif Ali Khan)  , జాన్వీకి (Janhvi Kapoor) ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడ్డారు. దేవర1 మూవీ నిర్మాతలకు 50 కోట్ల రూపాయల మేర టేబుల్ ప్రాఫిట్స్ ను అందించిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. దేవర నైజాం 42 కోట్ల రూపాయలు, సీడెడ్ 22 కోట్ల రూపాయలు, మిగతా ఆంధ్రప్రదేశ్ జిల్లాల హక్కులు 46 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఓవర్సీస్ 27 కోట్ల రూపాయలు, దేవర కర్ణాటక, హిందీ వెర్షన్ హక్కులు చెరో 15 కోట్ల రూపాయలు, తమిళనాడు కేరళ హక్కులు 6.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా. నిర్మాతలు బిజినెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో టాక్ పాజిటివ్ గా ఉంటే భారీగా కలెక్షన్లు వస్తాయి. 175 కోట్ల రూపాయలకు అటూఇటుగా దేవర సినిమాకు బిజినెస్ జరిగింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. దేవర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే మూవీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర1 రిజల్ట్ ఆధారంగా దేవర సీక్వెల్ ఎప్పటినుంచి సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ రానుంది. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus