‘దేవర’ (Devara) మరో 6 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న మూవీ ఇది. అందుకే ట్రేడ్ వర్గాల్లో కూడా ‘దేవర’ హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. అందుకే ‘దేవర’ ని హిందీలో, ఓవర్సీస్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
కానీ ఒక్క ఏరియాలో మాత్రం ‘దేవర’ కి బిజినెస్ జరగడం లేదట. దీంతో నిర్మాతలు స్వయంగా ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘దేవర’ చిత్రానికి కేరళలో బిజినెస్ జరగలేదట. దీంతో సుధాకర్ (Sudhakar Cherukuri) , కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ..లు అక్కడ బడా డిస్ట్రిబ్యూటర్ సాయంతో అడ్వాన్స్..ల రూపంలో విడుదల చేసుకుంటున్నారట. గతంలో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ కి (Janatha Garage) కేరళలో మంచి బిజినెస్ జరిగింది.
2016 టైంలోనే ‘జనతా గ్యారేజ్’ అక్కడ రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అప్పుడు ‘ఎన్టీఆర్ స్టార్ పవర్ అలాంటిది’ అని అంతా అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal) నటించాడు. ఆయన మలయాళంలో స్టార్ హీరో. అందుకే ఆ సినిమాకి మలయాళంలో అంత బిజినెస్ జరిగింది. ‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ రోల్.. ఎన్టీఆర్ ని సైతం డామినేట్ చేసే విధంగా ఉంటుంది.
అందువల్లనే మలయాళంలో ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా రిజల్ట్ ను చూపించి ‘దేవర’ కి అక్కడ భారీగా కోట్ చేశారు నిర్మాతలు. కానీ అక్కడి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు అని స్పష్టమవుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ ఇమేజ్ కూడా ఎన్టీఆర్ కి హెల్ప్ అవ్వలేదు.