Kiran Rao: మా సినిమాను ఆస్కార్‌కు పంపండి.. లేడీ డైరెక్టర్‌ రిక్వెస్ట్‌! ఆయన వల్ల కానిది!

  • September 22, 2024 / 05:41 PM IST

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఇండియన్‌ సినిమా నుండి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన సినిమాలు ఎన్నో తెలుసా? దానికి ఆన్సర్‌ చెబుదాతాం కానీ.. అసలు ఇప్పుడు ఎందుకీ చర్చ అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక సినిమాను తీసిన అనుభవం ఉన్న ఓ దర్శకురాలు తన రెండో సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యే స్థాయి ఉంది అని చెబుతున్నారు కాబట్టి. ఆ దర్శకురాలు కిరణ్‌ రావ్‌ (Kiran Rao) అయితే.. ఆ సినిమా ‘లాపతా లేడీస్‌’. అవును, 13 ఏళ్ల క్రితం ‘ధోబీ ఘాట్‌’ అనే సినిమా తీసిన కిరణ్‌ రావు..

Kiran Rao

ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ‘లాపతా లేడీస్‌’ అని రెండో సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇప్పటికే వివిధ అవార్డులు అందుకున్న సినిమా టీమ్‌.. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో తమన సినిమా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన చిరకాల కోరిక అని కూడా చెప్పారు. 2025లో ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ తరఫున అధికారిక ప్రవేశానికి ‘లాపతా లేడీస్‌’ సినిమా అర్హత సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు కిరణ్‌ రావ్‌.

ఆస్కార్ వేదికపై ఈ సినిమా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలి అనేది నాతో పాటు మా యూనిట్‌ కోరిక. ఈ సినిమాను ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌కు పంపుతుందని ఆశిస్తున్నాను అని ఆమె చెప్పారు. ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే.. 2001 కాలానికి చెందిన కథ ఇది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన నేపథ్యంలో కథ సాగుతుంది.

ప్రతిష్ఠాత్మక టొరెంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో గతేడాది ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఈ సినిమాను అక్కడ ప్రదర్శించారు. ఇక ఆస్కార్‌కు 1957 నుండి ఇప్పటివరకు ఏటా మన సినిమాలు నామినేషన్‌ కోసం వెళ్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ‘మదర్‌ ఇండియా’ (1957), ‘సలామ్‌ బాంబే’ (1988), ‘లగాన్‌’ (2001) నామినేట్‌ అయ్యాయి. మరి ఈ ఏడాది ఏమవుతుందో చూడాలి.

క్యాస్టింగ్‌ కౌచ్‌.. మీరిలా చేయండి అంటున్న ఐశ్వర్య.. ఏం చెప్పిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus