ఎన్టీఆర్కాం (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) బినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(Devara)(మొదటి భాగం). ఈ సినిమాతో ‘యువసుదా ఆర్ట్స్’ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగు డెబ్యూ మూవీ కూడా ఇదే.సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కానీ గాంధీ జయంతి, దసరా హాలిడేస్ వంటివి బాగా కలిసొచ్చి మాస్ సెంటర్స్ లో బాగా కలెక్ట్ చేసింది.
పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడం, ‘దావూదీ’ సాంగ్ తర్వాత యాడ్ చేయడం వంటివి ‘దేవర’ లాంగ్ రన్ కి కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి (Devara ) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 59.16 cr |
సీడెడ్ | 30.99 cr |
ఉత్తరాంధ్ర | 17.67 cr |
ఈస్ట్ | 9.93 cr |
వెస్ట్ | 7.87 cr |
గుంటూరు | 12.41 cr |
కృష్ణా | 8.91 cr |
నెల్లూరు | 5.91 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 152.85 cr |
కర్ణాటక | 15.95 cr |
తమిళనాడు | 2.50 cr |
కేరళ | 0.77 cr |
నార్త్ | 29.11 cr |
ఓవర్సీస్ | 35.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 236.58 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.236.58 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.61.58 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించి సూపర్ హిట్ గా నిలిచింది.