‘రీ రిలీజ్..ల ట్రెండ్ ఇక ముగిసింది’.. అని అంతా అనుకుంటున్న టైంలో మహేష్ బాబు (Mahesh Babu) ‘మురారి’ (Murari) చిత్రం 4K లో రీ- రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన వచ్చింది. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం రీ – రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్యాన్స్ థియేటర్స్ లో ఈలలు, గోలలు చేసుకునేంత స్టఫ్ అందులో ఉండదు. అది పక్కా క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ. అలాంటి సినిమా రీ- రిలీజ్ చేస్తే.. జనాలు వస్తారా? అనే ఆలోచనలు కూడా చాలా మందికి వచ్చాయి.
అయితే ఆ సినిమా రీ – రిలీజ్…లలో అప్పటివరకు ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. మొదటి రోజు అంటే ఫ్యాన్స్ వల్ల రీ – రిలీజ్ అయ్యే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. రెండో రోజున ఆ సినిమాని జనాలు పట్టించుకునే ఛాన్స్ ఉండదు. కానీ ‘మురారి’ (Murari) విషయంలో ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ అయ్యింది. రెండో రోజు మాత్రమే కాదు 5 వ రోజుకు కూడా జనాలు వెళ్లారు.
అలా బాక్సాఫీస్ వద్ద రూ.8.6 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది ‘మురారి’ (Murari) . ‘బుక్ మై షో’లో 2 లక్షల 57 వేల వరకు టికెట్స్ సేల్ అయ్యాయి. ఇక ‘మురారి’ రికార్డుని బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్.. ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) ని పవన్ పుట్టినరోజు నాడు దింపారు. ఈ సినిమా కూడా మొదటి రోజు ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టింది.
రీ- రిలీజ్ లో మొదటి రోజు ‘గబ్బర్ సింగ్'(4K ) రూ.8 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. అయితే రెండో రోజు నుండి టికెట్స్ తెగలేదు. వారం రోజులు థియేటర్స్ లో అందుబాటులో ఉన్నా ‘గబ్బర్ సింగ్’ కి 2 లక్షల 37 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.8.2 కోట్ల వద్దే ఆగిపోయింది. అలా రీ- రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘మురారి’ (Murari) నిలిచింది. అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘గబ్బర్ సింగ్’ నిలిచింది.