Devara Movie: అనిరుధ్ వల్ల దేవరకు పెరిగిన క్రేజ్.. రైట్స్ ఎన్ని రూ.కోట్లంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడగా ఈ సినిమా రిలీజ్ కు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ తమకు పండుగ రోజు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

దేవర మూవీ (Devara Movie) నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడగా ఈ సినిమా రైట్స్ ఏకంగా 130 నుంచి 140 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం ఈ సినిమాకు కలిసొచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపుగా సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రికవరీ అయినట్టేనని సమాచారం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ కు కొరటాల శివ ఫ్యాన్ ఫాలోయింగ్ తోడు కావడంతో ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. తారక్ గత సినిమాలను మించి దేవర ఉండనుందని అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. దేవర సినిమాకు విడుదలకు ముందే భారీ లాభాలు రావడం గ్యారంటీ అని తెలుస్తోంది.

చాలా సంవత్సరాల తర్వాత తారక్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది. అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకున్నా ఈ సినిమా నిరాశ పరచదని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ దేవర సినిమాతో కచ్చితంగా దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus