Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్ పై తారక్ క్రేజీ అప్ డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర  (Devara)  సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ కానున్నట్టు చెప్పారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఈ ట్రైలర్ ఉండనుంది.

Devara

ముంబైలో ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగనుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం నిజమో కాదో చూడాల్సి ఉంది. దేవర ( Devara) ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ రావడంతో పాటు తారక్ కొత్త పోస్టర్ ను షేర్ చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. రెండు పాత్రల్లో కనిపిస్తున్న తారక్ ఒక పాత్రలో కేవలం బ్లాక్ డ్రెస్ లో కనిపించనున్నారు. దేవర సినిమా ట్రైలర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది.

దేవర (Devara) మూవీ కథ, కథనానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. దేవర ట్రైలర్ విడుదలైతే ఆ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఒకింత సంచలనం అవుతోంది. అదే సమయంలో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు సైతం ఊహించని విధంగా ఉన్నాయి.

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దేవర టాప్ లో ఉంది. గతంలో ఏ సినిమా క్రియేట్ చేయని రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేవర మూవీ రిలీజ్ సమయానికి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. ఈ ఏడాది తారక్ సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

‘ది గోట్’.. 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus