Devara: అఫీషియల్.. యంగ్ టైగర్ దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ ఇదే!

నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతేడాది కొత్త సంవత్సరం సందర్భంగా దేవర రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్ ఈ ఏడాది కొత్త సంవత్సరం కానుకగా దేవర పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు ఈ సినిమా గ్లింప్స్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. తారక్ సరికొత్త లుక్ తో ఉన్న దేవర పోస్టర్ తాజాగా రిలీజ్ కాగా ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

దేవర కొత్త పోస్టర్ వేరే లెవెల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. టక్కేసిన జూనియర్ ఎన్టీఆర్ లుక్ సాధారణ సినీ అభిమానులకు సైతం ఎంతో నచ్చేసింది. ఈ నెల 8వ తేదీన గ్లింప్స్ రిలీజ్ కానుంది. అదే సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సైతం ఎలాంటి మార్పు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. దేవర గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.

దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా కొన్నిరోజుల క్రితం అనిరుధ్ దేవర గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ సైతం నెట్టింట తెగ వైరల్ అయింది. సముద్రతీర వాసుల కోసం పోరాడే యోధుడిగా తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఆసక్తికర ట్విస్ట్ తో ఫస్ట్ పార్ట్ ముగియనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పుంజుకోనుందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ఎంతో కష్టపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో దేవర ముందువరసలో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus