ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అంతకంతకూ ఆలస్యంగా రిలీజవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఆవేదన అంతాఇంతా కాదు. అయితే దేవర సినిమా మాత్రం ప్రీపోన్ కావడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. స్టూడెంట్ నంబర్ 1 రిలీజైన 23 సంవత్సరాల తర్వాత దేవర సినిమా రిలీజ్ కానుండటం ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
రిలీజ్ డేట్ మారడం వల్ల ఈ సినిమాకు గతంలో వచ్చిన ఆఫర్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఆఫర్లు వస్తున్నాయని 450 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ హ్యాపీగా ఉన్నారని రిలీజ్ డేట్ మార్పు వల్ల ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా లాభాలు పెరగనున్నాయని భోగట్టా.
దేవర సినిమా దసరా సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని భోగట్టా. త్వరలో థాయిలాండ్ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆగష్టు చివరి నాటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ సైతం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ విలనిజం, జాన్వీ కపూర్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి. దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందే 150 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.