Daavudi Song: ‘దేవర’ టీం.. పెద్ద ప్లానే… కానీ..!

  • September 27, 2024 / 07:23 PM IST

ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూసిన ‘దేవర’ (Devara) చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కూడా కావడంతో.. సహజంగా మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని పూర్తి స్థాయిలో ‘దేవర’ అందుకుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ ‘ఆచార్య’ (Acharya) తో పోలిస్తే ‘దేవర’ 10 రెట్లు బెటర్ గానే ఉంది.

Devara

ఫస్ట్ హాఫ్, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, అనిరుధ్  (Anirudh Ravichander) నేపధ్య సంగీతం, రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ వంటివి సినిమాకి ఆయువుపట్టుగా నిలబడ్డాయి. సెకండాఫ్ లో ల్యాగ్ ఉంది అనే కంప్లైంట్ కూడా లేకపోలేదు. ప్రీ క్లైమాక్స్ పర్వాలేదు అనిపించినా..! ఎక్కడో ఒక ‘హై’ మూమెంట్ మిస్ అయిన ఫీలింగ్ అభిమానుల్లో ఏర్పడింది. అది ‘దావూది’ సాంగ్ రూపంలో రావాలి. ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ పాటను సినిమాలో పెట్టలేదు దర్శకుడు కొరటాల. ఆ పాటను కలుపుకుంటే సినిమా రన్ టైం 3 గంటలు దాటేస్తుంది అనుకున్నాడో..

ఏమో కానీ.., ‘దావూది’ పాటని తీసేశాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్..ల ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ ని బిగ్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఆడియన్స్ అయితే మిస్ అయ్యారు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు తీసేసి ఆ పాటను యాడ్ చేస్తే బెటర్ అనేది కొందరి ప్రేక్షకుల అభిప్రాయం. అయితే మేకర్స్ మైండ్లో కూడా ‘దావూది’ పాటని రిలీజ్ తర్వాత యాడ్ చేయాలనే ఆలోచన ఉందట. ‘దేవర’ కి అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్ ముగిశాక గాంధీ జయంతి హాలిడే ఉంది.

ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏవీ లేవు. దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి.. 2 వారాల పాటు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసమే దసరా హాలిడేస్ టైంకి ‘దావూది’ సాంగ్ యాడ్ చేయాలనేది దర్శకుడు కొరటాల శివ అండ్ టీం ప్లాన్ గా తెలుస్తుంది. గతంలో కొరటాల శివ తీసిన ‘మిర్చి’ (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకే సీన్లు యాడ్ చేయడం జరిగింది.

తారక్‌ – కొరటాల ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందా? అదే ఇబ్బంది పెట్టిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus