స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల రెండో సినిమాగా ‘మోగ్లీ’ రూపొందింది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. డిసెంబర్ 12న విడుదల కాబోతోంది ఈ సినిమా. తాజాగా ట్రైలర్ ను వదిలారు.
‘మోగ్లీ’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 52 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ సినిమాలో హీరో ఓ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్. అతను ఇంకో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ అయిన అమ్మాయిని.. అదే హీరోయిన్ ని ప్రేమిస్తాడు. ఒక రోజు వీళ్ళు యాక్ట్ చేస్తున్న సినిమాలో హీరో… బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టు అయిన హీరోయిన్ పై కన్నేస్తాడు. ఆమెకు మూగది.. అలాగే వినికిడి సమస్య కూడా ఉంటుంది. దీంతో ఆమెకు అండగా నిలబడతాడు కిట్టు.. అలియాస్ మోగ్లీ.
అతనికి బుద్ది చెప్పే క్రమంలో మోగ్లీ ఓ సమస్యలో చిక్కుకుంటాడు. దీంతో పోలీస్ అయినటువంటి విలన్ ఎంట్రీ. అతని వల్ల వీళ్ళకి సమస్యలు మరింత పెరుగుతాయి. చివరికి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ అని అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ట్రైలర్ కి హైలెట్స్ అంటే కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలాగే ప్రభాస్ రిఫరెన్సులు వాడటం. హీరో- విలన్ ఫేస్ టు ఫేస్ చూసుకునే షాట్ ఏదైతే ఉందో అది ‘బాహుబలి’ ని గుర్తుచేస్తుంది.
అలాగే విలన్ బండి సరోజ్ యాక్టింగ్ ‘వర్షం’ సినిమాలో గోపీచంద్ విలనిజంని పోలి ఉంది. మధ్యలో ఫ్రెండ్ రోల్ చేస్తున్న వైవా హర్ష కూడా ‘నువ్వేమైనా ప్రభాసా?’ అంటూ ఓ డైలాగ్ విసిరాడు.అలాగే సలార్ కటౌట్ కూడా కనిపించింది. బహుశా ఇది నిర్మాత విశ్వప్రసాద్ ఆలోచన కావచ్చు.
‘రాజాసాబ్’ కి కూడా ఆయనే నిర్మాత కాబట్టి.. ‘మోగ్లీ’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకర్షించాలి అని భావించి ఉండొచ్చు.