హౌస్ లో నాతో కూడా రిలేషన్ పెట్టుకోవడానికి ట్రై చేశారు!

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దేవి నాగవల్లి గురించి అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత వారం హౌస్ నిండి ఎలిమినేటై బయటికి వచ్చిన దేవి అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోని వ్యక్తులు, వారి ప్రవర్తన వంటి విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించిన చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. బిగ్ బాస్ హౌస్ నుండి తాను ఎలిమినేట్ అవడం వెనుక ఎదో జరిగిందన్న అనుమానం దేవి వ్యక్తం చేశారు.

ఇంటిలోని సభ్యులు కొందరు అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారని, అది కూడా వారు సేవ్ కావడానికి ఒక కారణం అన్నారు. తెలుగు మాట్లాడడం రాకపోయినా మోనాల్ ఎలిమినేషన్ నుండి ప్రతిసారి ఎలా సేవ్ అవుతున్నారని ప్రశ్నించారు. హౌస్ లో తనతో కూడా కొందరు అలాంటి రిలేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేశారని, అందుకు నేను ఇష్టపడలేదు అన్నారు. నిజంగా నా నుండి అలాంటి కోణం ఆశిస్తే హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదని దేవి చెప్పుకొచ్చారు.

ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన మాజీ భర్త అమెరికాలో ఉన్నట్లు చెప్పారు. కుటుంబంతో కలిసి అతను అక్కడ సెటిల్ అయ్యారని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని దేవి చెప్పడం విశేషం. తనను, తన ఆరేళ్ళ కొడుకు కార్తికేయను అంగీకరించి పెళ్లి చేసుకుంటాను అంటే, దానికి తాను సిద్ధం అని చెప్పారు. అయితే కొడుకు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది తెలియదు అన్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus