పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ ఊహించని స్థాయిలో హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా సమంత డ్యాన్స్ చేయడం ఈ పాటకు ప్లస్ అయిన సంగతి తెలిసిందే. అయితే మగవాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ సాంగ్ ఉందనే కామెంట్లు వినిపించాయి. పలువురు రాజకీయ నాయకులు సైతం ఊ అంటావా పాట విషయంలో సీరియస్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట విషయంలో ఇచ్చిన వివరణ సైతం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా దేవిశ్రీ ప్రసాద్ మరోసారి ఈ సాంగ్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊ అంటావా ఊహూ అంటావా పాట లిరిక్స్ తో చంద్రబోస్, సుకుమార్ తన దగ్గరకు వచ్చారని ఆ సమయంలో ఈ పాట విషయంలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని తాము ఊహించామని దేవిశ్రీ ప్రసాద్ కామెంట్లు చేశారు. అయితే ఆ పాట కొరకు తాము నిజాయితీగా పని చేశామని పాట ద్వారా మనోభావాలు దెబ్బ తీయడం తమ ఉద్దేశం కాదని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి పాట ద్వారా వివరించాలని తాము భావించామని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. మగాళ్లంతా అదే విధంగా ఉంటారని సినిమా ద్వారా చెప్పడం తమ ఆలోచన ఏ మాత్రం కాదని ఆయన అన్నారు. మహిళా స్నేహితులు, మహిళా జర్నలిస్టులు ఆ పాట విని మంచి సందేశం ఇచ్చారని తమను మెచ్చుకున్నారని దేవిశ్రీ ప్రసాద్ కామెంట్లు చేశారు. కొన్నిరోజుల క్రితం యూట్యూబ్ లో ఊ అంటావా వీడియో సాంగ్ విడుదలైంది.
ఈ పాటకు ఏకంగా 51 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో ఊ అంటావా పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. పుష్ప సక్సెస్ తో దేవిశ్రీ ప్రసాద్ జోరు పెరిగింది. సినిమాసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!