Devi Sri Prasad: నానా మాటలు అన్నారు.. ఇప్పుడు తెగ మెచ్చుకుంటున్నారు.. ఇదేగా జీవితమంటే?

ప్రతి శుక్రవారం సినిమా వాళ్ల జాతకాలు మారిపోతాయి అంటుంటారు. అంటే ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్‌ అయ్యేప్పుడల్లా వాటి ఫలితం బట్టి వాళ్ల కెరీర్‌లు మారిపోతుంటాయి. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అంటే ఏ రోజుకారోజు మారిపోతుంటాయి. ఇందులో ఏమన్నా డౌట్‌ ఉంటే దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad)  గురించి సోషల్‌ మీడియాలో చూస్తే సరి.ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ప్రసాద్‌ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ‘కంగువ’ లాంటి పెద్ద సినిమాకు సంగీతం అందిస్తున్నారు అనేది ఒక కారణమైతే..

Devi Sri Prasad

‘పుష్ప: ది రూల్‌’(Pushpa2) సినిమా బ్యాగ్రౌండ్‌ స్కోరు బాధ్యతల నుండి పక్కన పెట్టేశారు అనేది మరో కారణం. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు మొదలైపోయాయి ఆయన మీద. ‘కంగువ’ (Kanguva) ఫలితం వచ్చాక అయితే ఆ విమర్శలు బాగా పెరిగిపోయాయి. ఒక‌ప్పుడు అదిరిపోయే పాట‌లు, నేప‌థ్య సంగీతంతో భారీగా అభిమానుల్ని సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దిగడం మొదలైంది. ఆ సమయంలో ‘పుష్ప: ది రైజ్‌’(Pushpa)  వచ్చి మొత్తం పరిస్థితి మార్చింది.

‘వాల్తేరు వీరయ్య’ కూడా బాగా కలిసొచ్చింది. ‘పుష్ప: ది రూల్‌’ కూడా ఉండటంతో కెరీర్‌ మరో స్థాయిలోకి వెళ్తుంది అని అనుకున్నారు. కానీ ‘కంగువ’ ఫలితం తేడా కొట్టి దెబ్బేసింది. ధనుష్‌  (Dhanush)  – నాగార్జున (Nagarjuna) – శేఖర్‌ కమ్ములల (Sekhar Kammula)  సినిమా ‘కుబేర’ టీజర్ ఇటీవల రిలీజైంది. అందులో విజువల్స్‌ను మించి బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. అందరూ దాని గురించే పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. దీంతో చేదులో తీపి అనేలా దేవిశ్రీ ప్రసాద్‌ పరిస్థితి ఉంది అని అంటున్నారు.

‘కంగువ’ గురించి నానా మాటలు అన్నారు.. ఇప్పుడు తెగ మెచ్చుకుంటున్నారు.. ఇదేగా జీవితమంటే? అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘కుబేర’ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుండి రాబోతున్న డిఫరెంట్‌ మూవీ ఇది. ఇన్నాళ్లూ ఎమోషన్స్‌ మీద సినిమాలు తీసిన ఆయన ఈ సారి భారీ కాన్వాస్‌ మీద స్టార్‌ యాక్టర్లతో ఈ సినిమా చేస్తున్నారు.

చిన్న పాత్ర చేస్తేనే ఊగిపోయారు.. ఇప్పుడు సినిమా అంతా వీరుడిగా అల్లు అర్జున్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus