టాలీవుడ్‌లో 25 ఏళ్లకు పైగా తన సంగీతంతో అలరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) , ఈ మధ్య పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రాజెక్ట్ ద్వారా మరోసారి దుమ్ము రేపాడు. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో దేవి తన వృత్తిపరమైన విలువలు, అభిప్రాయాలపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిని కాదని కొన్ని సీన్స్ కోసం థమన్ ను (S.S.Thaman) అలాగే మరో ఇద్దరిని తీసుకున్నారు. ఈ విషయంలో దేవి బాగా ఫీల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి.
పుష్ప 2లోని సాంగ్స్ ఇప్పటికే హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీలీలపై (Sreeleela) చిత్రీకరించిన “కిస్సిక్” సాంగ్ యూత్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ పాట నిర్మాణం గురించి దేవిశ్రీ మాట్లాడుతూ, సుకుమార్ ఇచ్చిన ఐడియా నుండి స్ఫూర్తి పొందాను. “కిస్సిక్” పదం చాలా ఆసక్తిగా అనిపించి, అందులోనే ట్యూన్ అందించాను. ఇది సుకుమార్‌గారికి బాగా నచ్చడం వల్ల వెంటనే ఫైనల్ చేశారు. “ఎక్కువ పాటల కోసం ఎన్నో ట్యూన్స్ కంపోజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ,” అని దేవిశ్రీ తెలిపారు.
ఇతర సంగీత దర్శకుల ట్యూన్స్‌ను అనుకరించడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన దేవిశ్రీ ప్రసాద్, “నేను నా ట్యూన్స్‌ను పూర్తిగా ఒరిజినల్‌గా ఉంచేందుకు కట్టుబడి ఉంటాను. ఇది నా కెరియర్ ఆరంభం నుంచే నేను పాటిస్తున్న నిబంధన,” అని చెప్పాడు. మరొకరి ట్యూన్స్‌ను కాపీ చేయడం నైతికంగా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఒకసారి మహేష్ బాబు సినిమా కోసం నా దగ్గరకు వచ్చారు. అప్పటికే మరొక మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేసినప్పటికీ, పని సరిగా చేయడం లేదని నన్ను సంప్రదించారు.
కానీ నేను ఆ అవకాశం తీసుకోలేదు. మహేష్ బాబు (Mahesh Babu) ఆతరువాత నాకు ఈ విషయంపై అభినందనలు తెలియజేశారు.. అని చెప్పారు. నైతిక విలువలపై మరింతగా మాట్లాడిన దేవిశ్రీ, “ప్రతి ఒక్కరికి తమకు కలిగిన ట్యాలెంట్‌తోనే ఎదగాలని నేను నమ్ముతాను. స్వార్థం వల్ల దారి తప్పితే మన పని స్థాయి తగ్గిపోతుంది,” అని స్పష్టం చేశారు.