Devi Sri Prasad: పుష్ప సక్సెస్ తో దేవిశ్రీ రెమ్యునరేషన్ పెంచేశారా?

గత కొన్నేళ్లలో స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సైతం డిమాండ్ కు తగిన విధంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో పారితోషికం విషయంలో దేవిశ్రీ ప్రసాద్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆఫర్ల విషయంలో థమన్ నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. అల వైకుంఠపురములో సక్సెస్ థమన్ కు ప్లస్ కాగా ఉప్పెన, పుష్ప సినిమాల సక్సెస్ దేవిశ్రీకి ప్లస్ అయింది.

అయితే దేవిశ్రీ ప్రసాద్ తన రెమ్యునరేషన్ ను ఊహించని స్థాయిలో పెంచేశారని సమాచారం. పవన్ సినిమా కొరకు దేవిశ్రీ ప్రసాద్ ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. పవన్ దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయి. పవన్ హీరోగా తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

దేవిశ్రీ ప్రసాద్ పవన్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడని పవన్ అభిమానులు నమ్ముతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పవన్ అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తారో లేదో చూడాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ పరిమితంగా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రతి సినిమాలో పాటలు హిట్ అయ్యే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవిశ్రీకి ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus