Devil Censor Review: ‘డెవిల్’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైం ఎంతో తెలుసా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించి డైరెక్షన్ కూడా చేశారు. డిసెంబ‌ర్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. అది మంచి రెస్పాన్స్ నే రాబట్టుకుంది. ఇదొక పీరియాడిక్ జోనర్‌లో సాగే స్పై థ్రిల్లర్ అని అందరికీ క్లారిటీ ఇవ్వడంతో పాటు అంచనాలు కూడా పెంచింది అని చెప్పాలి.

పాటలు కూడా ఓకే అనిపించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది చిత్రబృందం. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సారు బృందం.. యు/ఎ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం వచ్చేసి 2 గంటల 26 నిమిషాలు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా చూశాక సెన్సార్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్..లు, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ అన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయట.

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, ,తమ్మిరాజు ఎడిటింగ్ , శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ హైలెట్ గా నిలుస్తాయట. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా అందరూ ఇప్పటివరకు ‘బింబిసార’ గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ‘డెవిల్’ కి ‘బింబిసార’ ని మించి బడ్జెట్ పెట్టి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారట అభిషేక్ నామా. మరి డిసెంబర్ 29న ఈ సినిమా (Devil) ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus