దర్శకధీరుడు రాజమౌళి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇది సినిమాకు సంబంధించిన సమస్య కాదు.. వ్యక్తిగత విషయం. అయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పిన మాట దేశం మొత్తం చర్చకు దారితీసింది. అది ఏమిటంటే .. తాను దేవుళ్లను నమ్మకం పోవడమే. ప్రతి సినిమాలోనూ దేవుళ్లపై సన్నివేశాలను చిత్రీకరించే ఆయన నాస్తికుడని ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తడం, క్లైమాక్స్ లో శివలింగాన్ని చూపించిన విధానానికి ఆస్తికులందరూ ఫిదా అయిపోయారు. రాజమౌళి శివుడు భక్తుడని భావించారు. ఇప్పుడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు.
దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు మీ సినిమాల్లో దేవుళ్లను ఎందుకు ఉపయోగించారని భక్తులు రాజమౌళి పై విరుచుకు పడుతున్నారు. ఈ విషయం పై భాష బేధం లేకుండా దేశం మొత్తం మీద ఉన్న ఆస్తికులు, ముఖ్యంగా హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ఉపనిషత్తులు, వేదాలకు నిలయంగా ఉన్న భారతదేశంలో దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపిస్తున్నారు. మరి వారి ఆగ్రహాన్ని జక్కన్న ఎలా చల్లారుస్తారో ఆయనకే తెలియాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.