మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. 3వ వీకెండ్లో కూడా బాగా కలెక్ట్ చేసింది అనే చెప్పాలి. ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 17.15 cr |
సీడెడ్ | 6.75 cr |
ఉత్తరాంధ్ర | 4.29 cr |
ఈస్ట్ | 1.76 cr |
వెస్ట్ | 1.23 cr |
గుంటూరు | 1.68 cr |
కృష్ణా | 1.68 cr |
నెల్లూరు | 0.92 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 35.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.43 cr |
ఓవర్సీస్ | 2.64 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 41.57 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.17 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.41.57 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.20.87 కోట్ల లాభాలను అందించింది. అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు.
17వ రోజు కూడా ఈ మూవీ కోటి పైనే షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఇంకో రెండు రోజులు ‘ధమాకా’ హవా నడిచే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు ఎంట్రీ ఇస్తాయి కాబట్టి వర్కౌట్ అవ్వకపోవచ్చు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!