మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. సంక్రాంతి సీజన్ వరకు నిలబడటం విశేషమనే చెప్పాలి. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 17.95 cr |
సీడెడ్ | 7.28 cr |
ఉత్తరాంధ్ర | 4.58 cr |
ఈస్ట్ | 1.90 cr |
వెస్ట్ | 1.30 cr |
గుంటూరు | 1.88 cr |
కృష్ణా | 1.78 cr |
నెల్లూరు | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 37.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.57 cr |
ఓవర్సీస్ | 2.72 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 43.94 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.25 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.43.95 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.23.24 కోట్ల లాభాలను అందించింది. దీంతో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.
సంక్రాంతి సీజన్ వరకు ఈ మూవీ నిలబడి ఈ మూవీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుండడం విశేషమనే చెప్పాలి. రవితేజ కెరీర్లోనే ఈ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీగా నిలిచింది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?