Dhamaka Collections: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచిన ధమాకా.!

మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకున్న ఈ మూవీ నిన్న వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ వీక్ డేస్ లో కూడా అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 8.53 cr
సీడెడ్ 3.14 cr
ఉత్తరాంధ్ర 2.16 cr
ఈస్ట్ 0.98 cr
వెస్ట్ 0.77 cr
గుంటూరు 1.13 cr
కృష్ణా 1.05 cr
నెల్లూరు 0.56 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 cr
ఓవర్సీస్ 1.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.27 cr (షేర్)

‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 డేస్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.21.27 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది.. అలాగే బయ్యర్స్ కు రూ.0.57 కోట్ల లాభాలను అందించింది.

అవతార్2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేస్తుండడం అంటే మామూలు విషయం కాదు. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus