Dhamaka OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ‘ధమాకా’.. ఎప్పటినుండో తెలుసా?

‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి ప్లాప్ ల తర్వాత రవితేజ నుండి గతేడాది చివర్లో వచ్చిన చిత్రం ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు.భీమ్స్ సంగీత దర్శకుడు. డిసెంబర్ 23న ఈ మూవీ క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అవ్వగా.. మొదటి షోకే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే రిలీజ్ కు ముందు ఈ మూవీ సాంగ్స్ హిట్ అవ్వడం,

ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం, హీరోయిన్ శ్రీలీల లుక్స్ కూడా యూత్ ను కట్టి పడేయడంతో.. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్లు సాధించింది. రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా మొన్నటి వారు ‘క్రాక్’ ఉండగా ‘ధమాకా’ ఆ సినిమా కలెక్షన్లను అధిగమించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం..జనవరి 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

సో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించవచ్చు. నిజానికి సంక్రాంతి కానుకగా జనవరి 14 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ భావించింది. కానీ పండుగ సీజన్లో అనుకున్నంత వ్యూయర్ షిప్ రాకపోవచ్చు అని భావించి.. అలాగే థియేటర్లలో ఇప్పటికీ ‘ధమాకా’ రన్ అవుతూ ఉండటం వల్ల.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు అని సమాచారం.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus