Dhamaka Trailer: అంచనాలు పెంచేసిన ‘ధమాకా’ ట్రైలర్.. రవితేజ హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు, టీజర్ సూపర్ హిట్ అయ్యాయి. ‘ఖిలాడి’ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమాలతో డిజప్పాయింట్ అయిన రవితేజ ఫ్యాన్స్ కు ఈసారి హిట్టు దక్కేలా ఉంది అనే భరోసాని ఇచ్చాయి. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ 2 నిమిషాల 6 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘కోట్లల్లో ఒకడాడు.. కొడితే కోలుకోలేం’ అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్లో ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో స్వామి, ఆనంద్ చక్రవర్తి వంటి రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు రవితేజ. మరి డబుల్ రోల్ చేస్తున్నాడా? లేక ‘కింగ్’ టైపులో ఒక్కడే ఇద్దరు గా యాక్ట్ చేస్తున్నాడా అనే సస్పెన్స్ మెయింటైన్ చేశారు. శ్రీలీల లుక్స్ బాగున్నాయి.

ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి. జయరాం విలన్ గా కనిపిస్తున్నాడు. ‘మనకి కావాల్సిన వాళ్ళకి చేస్తే మోసం… మనం కావాలనుకునే వాళ్ల కోసం చేస్తే న్యాయం..’ అంటూ జయరాం అంటుంటే వెంటనే రవితేజ.. ‘త్రివిక్రమ్ మీ చుట్టమా సార్’ అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. అలాగే త్రినాథ్ రావు నక్కిన మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుంది అని ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చారు.

చివర్లో ‘నేను వెనుకున్న వాళ్ళను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెనుక ఎవ్వరూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జామ్పుల్ సెట్ చేసిన వాడ్ని’ అనే డైలాగ్ అయితే రవితేజ స్టయిల్లో గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. భీమ్స్ అందించిన బిజీయం,కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా అనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను పెంచే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus