Dhanush: ప్రతి సినిమా ఒక నేషనల్ ఫిలిమ్‌: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

దక్షిణాది నుండి పాన్‌ ఇండియా సినిమాలు రావడం, భారీ విజయాలు అందుకోవడంతో సౌత్‌ ఫిల్మ్‌ – నార్త్‌ ఫిల్మ్‌ అనే చర్చ గత కొన్ని రోజుల నుండి జరుగుతోంది. దీనిపై చాలామంది నటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే తమ అభిప్రాయాలు చెప్పారు. అలా కాదు, ఇలా అనండి అని డైరెక్ట్‌గానే అన్నారు. తాజాగా ఈ విషయంలో తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కూడా స్పందించాడు. ధనుష్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ ప్రచారంలో ఈ విషయమై స్పందించారు.

ధనుష్‌ తమిళంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు భాషల్లో కూడా నటిస్తున్నాడు. ఆయన నటించిన హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ‘ది గ్రే మ్యాన్‌’ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకులు రుసో బ్రదర్స్‌తో కలసి ధనుష్‌ మన దేశంలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్‌ను మీడియా ప్రతినిధులు… బాలీవుడ్, సౌత్ మధ్య డిబేట్ నడుస్తుంది కదా మీరేమంటారు అని అడిగారు. ‘‘మీ గురించి మాట్లాడినప్పుడు, రాసినప్పుడు ఇండియన్ స్టార్ అని రాయకుండా, సౌత్ హీరో అని రాస్తున్నారు.

దీనికి మీరేమంటారు’’ అని మీడియా అడగ్గా.. ధనుష్‌ ఫుల్‌ క్లారిటీ సమయం ఇచ్చాడు. ‘‘మమ్మల్ని దక్షిణాది నటులు అని పిలవాల్సిన అవసరం లేదు. అయినా అలా పిలవడంలో తప్పు లేదు. దక్షిణాది నుండి వచ్చిన హీరో అని వివరంగా చెప్పడం ఓకే. కానీ ఇండియా యాక్టర్స్ అని పిలిస్తేనే బాగుంటుంది’’ అని చెప్పాడు ధనుష్‌. నటుల్ని నార్త్ హీరోస్, సౌత్ హీరోస్ అని కాకుండా అందరూ కలిసి ఒక ఇండస్ట్రీగా మారాల్సిన సమయం వచ్చింది అని ధనుష్‌ సూచించాడు.

ప్రతి సినిమాను నేషనల్ ఫిలిమ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ సినిమా అని సెపరేట్‌గా చూడకూడదు అని అన్నాడు ధనుష్‌. మరి ధనుష్‌ ఆలోచనకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. సో.. మనమే స్టార్ట్‌ చేద్దాం ఆల్‌ ది బెస్ట్‌ ఇండియన్‌ స్టార్‌ ధనుష్‌ ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ‘ది గ్రే మ్యాన్‌’.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus